30 ఏళ్ల తర్వాత స్క్రీన్‌పై రాధ..

15
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్. తెలుగులో ఇప్పటివరకు 6 సీజన్లు పూర్తిచేసుకుంది. ఇటీవల 6వ సీజన్ పూర్తికాగా మరో షోకి తెరలేపారు స్టార్ మా టీవీ నిర్వాహకులు. బిగ్ బాస్ జోడీ అంటూ ఇప్పటివరకు 6 సీజన్లలో పాల్గొన్న కంటెస్టెంట్స్ నుండి జోడీలను ఎంపిక చేసి శని,ఆదివారాల్లో టెలీకాస్ట్ అయ్యేలా డ్యాన్స్‌ షో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

ఇక ఈ షోకి జడ్జిగా అలనాటి మేటీ హీరోయిన్ రాధ వ్యవహరిస్తోంది. వాస్తవానికి ఈ విషయాన్ని 6వ సీజన్ గ్రాండ్ ఫినాలేలో అనౌన్స్ చేశారు నాగార్జున. ఇక నిన్నిటి నుండి ఈ షో ప్రారంభంకాగా దాదాపు 30 ఏళ్ల తర్వాత మళ్లీ స్క్రీన్‌ పై దర్శనమిచ్చారు రాధ. ప్రస్తుతం ఆమె వయస్సు 57 ఏళ్లు, అయిన కూడా ఆమెలో ఉన్న ఎనర్జీ, కాన్ఫిడెన్స్ ఏమాత్రం తగ్గలేదు.

1980 కాలంలో రాధ టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు,చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ జత కట్టి అలరించింది. ఒకప్పుడు రాధ పేరు వినగానే డ్యాన్స్ గుర్తువచ్చేది. చిరంజీవితో పోటీపడి మరి రాధ స్టెప్పులు వేసింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -