ప్రేమలో పడి 100 సినిమాలు వదులుకుందట!

43
- Advertisement -

సీనియర్ నటి జయలలిత సోషల్ మీడియాలో ఈ మధ్య యాక్టిివ్ గా ఉంటుంది. తనను ఓ సహాయ దర్శకుడు రేప్ చేశాడని కామెంట్స్ చేసి షాక్ ఇచ్చింది. ఉన్నట్టు ఉండి తాజాగా తాను గతంలో ప్రేమలో పడి 100 సినిమాలు వదిలేసుకున్నా అంటూ కామెంట్స్ చేసింది. రోజుకి మూడు షిఫ్టులు పనిచేస్తున్న సమయంలోనే తనకి ఒక సమస్య ఎదురైందని చెప్పింది. ఆ సమయంలో తనకు ఓ వ్యక్తి అండగా నిలిచాడని, దీనితో అతనితో ప్రేమలో పడ్డానని ఆమె చెప్పుకొచ్చింది. ఆయన ప్రేమలో పడి దాదాపు 100 సినిమాలు వదిలేసుకుని ఉంటానని ఆమె అన్నారు.

ఐతే, అతనితో పెళ్లి తరువాత ఇబ్బందులు మొదలయ్యాయని అన్నారు. ఏడేళ్ల ప్రేమకి ఏడు నెలలు తిరగకముందే తెరపడిపోయింది అంటూ వివరించింది. ఇన్నేళ్ల తన జీవితంలో రుద్రంకోట అనే సినిమాలో తాను లీడ్ రోల్ చేశాను అని, ఆ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది అని జయలలిత చెప్పింది. ఈ సినిమాలో తాను చాలా ముఖ్యమైన పాత్రలో కనిపిస్తానని.. ఈ పాత్రకు ప్రేక్షకులు కచ్చితంగా కనెక్ట్ అవుతారని, సినిమా జనంలోకి వెళ్ళిన తర్వాత అందరూ ఆ సినిమాలోని పేరుతోనే తనను పిలుస్తున్నారని ఆమె పేర్కొంది.

ఇక తాను ఈ వయసులో మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన తనకు లేదు అని, కానీ కొందరు మాత్రం ఈ వయసులోనే ఓ తోడు ఉంటే జీవితం బాగుంటుంది అంటూ సలహా ఇస్తున్నారని, కానీ ఈ వయసులో మళ్లీ పెళ్లి చేసుకుని కొత్త సమస్యల్లో చిక్కుకోవడం తనకు ఇష్టం లేదు అని జయలలిత అన్నారు. ఇంతకీ, అరవై ఏళ్ల వయసులో నటి జయలలితకి పెళ్లి చేసుకో అని సలహా ఇస్తోంది ఎవరో!!.

Also Read:ఆమె స‌మంతను మారుస్తానంటుంది

- Advertisement -