రేటును అమాంతం తగ్గించేసింది.. మరీ పిలుస్తారా ?

95
actress
- Advertisement -

అవకాశాల్లేవ్, మరోపక్క మదర్ క్యారెక్టర్లకు కూడా ఫేడ్-అవుట్ అయిపోయింది. ఆమె గతం ఓ చరిత్ర.. కానీ ప్రస్తుతం అప్పుల కుప్పలు. ఎదిగిన కొడుకుల నుంచి కనీస సపోర్ట్ లేదు. ఈ బాధ భరించలేకే భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. నిజంగా సహజత్వానికి అసాధారణమైన భాధ వచ్చి పడింది అని ఆమె సమకాలికులు సానుభూతి వ్యక్తపరిచారు. కాలం ముందుకు కదిలింది. ఆమెకు అవకాశాలు కూడా బాగా తగ్గాయి. ఇక ఇక్కడ ఉంటే.. బ్యాంక్ బ్యాలెన్స్ పూర్తిగా కరిగిపోతుందని ఆ మధ్య అమెరికా పోయి.. ఏవో కొన్ని కార్యక్రమాలు చేసింది. ఓ మతాన్ని ప్రచారం చేసి.. ఆ రంగంలోనూ సేద తీరింది. మళ్లీ ఇండియా వచ్చింది, పూర్తిగా సన్నబడి. ఐతే, ఆమె దేహంలో మార్పులు వచ్చినంత ఈజీగా ఆమె సినిమా కెరీర్ లో మార్పులు రాలేదు.

తెలిసిన దర్శకులకు స్వయంగా ఫోన్లు చేసి ఛాన్స్ లు అడగడం మొదలు పెట్టింది. కథలో పాత్ర డిమాండ్ చేస్తే కచ్చితంగా మిమ్మల్నే పెట్టుకుంటాం అంటూ సదరు దర్శకులు కబుర్లు చెప్పారు. కానీ, అందమైన నిన్నటి తరం ఆంటీలకు ఆ పాత్రలు ఇచ్చేశారు. గ్లామర్ కు ఉన్న విలువ అది. అయినా ఈ రోజుల్లో అభినయం కంటే అందాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కాబట్టి.. సహజ నటన కంటే.. టెంప్టింగ్ ఫిజిక్ ముఖ్యం అని ఆమె అర్ధం చేసుకుంది. అయినా ఆమెకు ఏం తక్కువ..?, ఒకప్పుడు తన అందచందాలతో బాక్సాఫీస్ లను కుదిపేసింది. కానీ, వయసు పై పడిన తర్వాత మునపటి అందం తరిగిపోయింది. మెయిన్ గా బాడీ షేప్ అవుట్ అయిపోయింది.

కాబట్టి వచ్చిన అరకొర ఆఫర్లతోనే, ఎంతొస్తే అంత అన్నట్టుగా బండి లాగించేయాల్సిన పరిస్థితి ఆమెకు వచ్చేసింది. ఈ పరిస్థితుల్లోనే తన రేటును అమాంతం తగ్గించేసుకుంది. పైగా ఈ విషయాన్ని నిర్మాతలకు క్లారిటీ చెబుతూ మెసేజ్ లు పాస్ చేస్తోంది. మరి తగ్గిన రెమ్యూనరేషన్ కారణంగా నైనా ఆ సీనియర్ నటికి మళ్లీ అవకాశాలు పెరుగుతాయని ఆశిద్దాం.

ఇవి కూడా చదవండి..

- Advertisement -