‘సెల్ఫిష్’ ..అప్‌డేట్

51
- Advertisement -

తొలి చిత్రం ‘రౌడీ బాయ్స్’తో ఆకట్టుకున్న యంగ్ హీరో ఆశిష్ రెడ్డి, నూతన దర్శకుడు కాశీ విశాల్ దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్ , ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ ల శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న యూత్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ ‘సెల్ఫిష్’ తో వస్తున్నాడు. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆశిష్ హనుమంతుని విగ్రహం ముందు నమస్కరించి చేతులు చాచాడు. ఈ పోస్టర్ లో ఆశిష్ సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.

మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఫస్ట్ సింగల్ దిల్ ఖుష్ కు అద్భుతమైన స్పందనను పొందడంతో బ్లాక్ బస్టర్ నోట్‌లో మ్యూజిక్ ప్రమోషన్‌లను ప్రారంభించారు.ఈ చిత్రంలో ఆశిష్ సరసన ఇవానా కథానాయికగా నటిస్తోంది. హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అశోక్ బండ్రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. జె యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.

Also Read:ప్చ్.. ఇప్పట్లో ఇక నో ఛాన్స్

సెల్ఫిష్ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

- Advertisement -