ఎంపీ కవిత చేపట్టిన ‘సిస్టర్స్ 4చేంజ్’కు అన్నివర్గాల మద్దతు లభిస్తోంది. సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు తమ మద్దతును ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్…. కవితను ప్రత్యేకంగా ట్వీట్‌లో అభినందించారు. సైనానేహ్వాల్, గుత్తా జ్వాల, మిథాలీరాజ్, అసోం ఎంపీ గౌరవ్ గొగోయ్,ఎంపీ కవితకు తమ మద్దతు ను ట్వీట్ ద్వారా తెలిపారు.
తాజాగా భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ….కవితపై ప్రశంసల జల్లు కురిపించారు. కవిత చేపట్టిన ‘సిస్టర్స్ ఫర్ చేంజ్’ అనే కార్యక్రమం నేపథ్యంలో వీరు ట్విట్టర్ ద్వారా కవితను మెచ్చుకున్నారు. కవిత చేపట్టిన కార్యక్రమం ఓ మంచి ప్రయత్నమని, అందరూ ఆహ్వానించదగినదని సెహ్వాగ్ కొనియాడాడు.
Good initiative. Driving helmetless & overspeeding is passport to grave. Please don't be in a hurry. Be safe & gift your loved ones a helmet https://t.co/oj5wtCUP2K
— Virender Sehwag (@virendersehwag) August 5, 2017
హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడంతో పాటు ఓవర్‌స్పీడ్‌తో వెళ్లడమంటే పాస్‌పోర్ట్ లేకుండానే శ్మశానానికి వెళ్లడం వంటిదని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తొందరపడొద్దని, అందరూ జాగ్రత్తగా డ్రైవ్ చేయాలన్నారు. అలాగే మీరు అభిమానించే వ్యక్తులకు హెల్మెట్‌ను గిఫ్ట్‌గా ఇవ్వాలన్నాడు.
బైక్ నడిపేటపుడు హెల్మెట్ పెట్టుకోవాలని, తమ సోదరులకు రాఖీ కట్టిన తర్వాత ప్రతి సోదరి కోరాలని.. అలాగే సోదరులకు హెల్మెట్ బహూకరించాలన్న ఉద్దేశంతో ‘సిస్టర్స్4చేంజ్’ పేరిట కవిత వినూత్న కార్యక్రమం చేపట్టారు.