ప్రియమణికి రిజిస్ట్రర్ మ్యారేజ్

262
Priyamani
- Advertisement -

ఒకప్పుడు తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాల్లో మంచి హీరోయిన్‌గా చక్రం తిప్పిన హీరోయిన్‌ ప్రియమణి త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. ప్రియమణికి తెలుగులో అవకాశాలు తగ్గినా .. మిగతా భాషల్లో కెరియర్ ను నెట్టుకొస్తూనే వుంది. కొంతకాలంగా ముస్తఫా రాజ్ తో ఆమె ప్రేమ వ్యవహారం గురించిన వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తూనే వున్నాయి.

priya mani

కొద్దికాలం క్రితమే తన బాయ్‌ఫ్రెండ్‌ ముస్తఫా రాజ్‌తో బెంగళూరులో నిశ్చితార్థం చేసుకున్న ఆమె ఈ నెల 23న పెళ్లి చేసుకోనుంది. ఈ వివాహం సెలబ్రెటీల పెళ్లిలా ఖరీదుగా కాకుండా చాలా సింపుల్‌గా రిజస్టర్‌ ఆఫీసులో జరగనుంది. కానీ పెళ్లి తర్వాత మాత్రం బెంగళూరులోని ఒక స్టార్‌ హోటల్లో ఘనమైన రీతిలో రిసెప్షన్‌ ఉంటుందని తెలుస్తోంది. చివరగా తెలుగులో మన ఊరి రామాయాణం చిత్రలో కనిపించిన ఆమె ప్రస్తుతం ఒక రియాలిటీ షోలో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది.

Priyamani-

ఇక ప్రియమణి ప్రేమాయణం ఓ డ్యాన్స్ షో ద్వారా సాగింది. ముస్తఫాను తొలిసారిగా ఓ డ్యాన్స్ షోలో కలిసిన ఈ అమ్మడు.. ఆ పరిచయాన్ని ప్రేమగా, ఆ తర్వాత వివాహం గా మార్చుకుంటున్నారు. అయితే ఎంగేజ్ మెంట్ తర్వాత ప్రియమణి వారిద్దరి ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి ఆశిర్వదించమని కోరింది. మంచి కథలతో వస్తే పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తానంటుంది ప్రియమణి.కొంతమంది కథానాయికలు ఎంతో ఆడంబరంగా వివాహం చేసుకుంటూ ఉంటే .. ప్రియమణి ఇలా రిజిస్టర్ ఆఫీసులో పెళ్లికి సిద్ధపడటం ఆశ్చర్యమే.

- Advertisement -