బౌలర్లను తనదైన డాషింగ్ శైలితో బెదరగొట్టే బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్… రిటైరైన తర్వాత కూడా ట్విట్టర్లో తనదైన ట్వీట్స్‌తో సెటైర్లను వేయడం మొదలుపెట్టాడు. క్రికెట్ మాత్రమే కాకుండా ఎలాంటి ఇష్యూస్పైన కూడా సెహ్వాగ్ బెదురు లేకుండా తను అనుకున్నది ట్వీట్ చేసేస్తాడు. తాజాగా న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడంలో కీలకపాత్ర పోషించిన ఆఫ్ స్పిన్నర్ అశ్విన్‌పైన కూడా ఓ పంచ్ ట్వీట్ విసిరాడు వీరూ. ఏడో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకున్నందుకు శుభాకాంక్షలు. పెళ్లయిన వ్యక్తికే ఇంటికి తొందరగా వెళ్లడంలో ఉన్న ఆతృత తెలుస్తుంది.. అన్నది ఆ ట్వీట్ సారాంశం.
న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసి టీమిండియా ఘన విజయం అందుకొన్న సంగతి తెలిసిందే. సిరీస్‌లో అద్భుత బౌలింగ్‌తో అదరగొట్టిన రవిచంద్రన్ అశ్విన్ కెరీర్లో ఏడోసారి మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో ‘ఏడు సార్లు మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికైన అశ్విన్‌కు అభినందనలు. కేవలం పెళ్లైన వ్యక్తికే తొందరగా ఇంటికి వెళ్లాల్సిన అవసరం గురించి బాగా తెలుస్తుందని’ ట్విట్టర్లో సెహ్వాగ్ చమత్కరించాడు. ఆ ట్వీట్‌ను అశ్విన్ లైట్ తీసుకున్నాడు. అయితే వారి భార్యలు మాత్రం వదల్లేదు.
త్వరగా రమ్మని తానేమీ అడగలేదన్న అర్థంలో అశ్విన్ భార్య ప్రీతి స్పందించింది. దీనికి ‘నేను కూడా అంతే. అయినా వీళ్లిద్దరికీ తొందర ఎక్కువే కదా అంటూ సెహ్వాగ్ వైఫ్ ఆర్తి ట్వీట్ చేసింది. వీళ్ల ఆసక్తికర సంభాషణ ట్విట్టర్లో వైరల్‌గా మారిపోయింది.