సీతా రామం చిత్రయూనిట్ కు షాక్!

402
seetharamam
- Advertisement -

వైజయంతి మూవీస్ బ్యానర్‌లో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటిస్తున్న చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా తమిళ్, మలయాళంలో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. ఆగస్టు 5న సినిమా రిలీజ్ కానుండగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే సినిమా రిలీజ్‌కు మరొక రోజు మాత్రమే ఉండగా చిత్రయూనిట్‌కు షాక్‌ ఎదురైంది. గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా రిలీజ్‌కు సెన్సార్ నో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో మతపరమైన కొన్ని సీన్స్ ఉన్నాయని, అందువల్లే ఈ సినిమాను గల్ఫ్‌లో రిలీజ్ చేయవద్దని సూచించారట. అయితే దీనిపై మరోసారి సెన్సార్ బోర్డును సంప్రదించే పనిలో ఉంది చిత్రయూనిట్.

రష్మిక మందన, సుమంత్, భూమిక కీ రోల్ పోషించగా అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఎలా ఉంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -