హైదరాబాద్ నగరంలో ప్రముఖ రెస్టారెంట్లు, హోటళ్లకు సంబంధించిన యజమానుల ఇళ్లలో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు చేపట్టిన సోదాలు రెండవ రోజు కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పిస్తా హౌస్, మెహిఫిల్, షా హౌస్ హోటళ్ల యజమానుల ఇళ్లు, కార్యాలయాలు ఐటీ అధికారుల తనిఖీల్లో ఉన్నాయి.
ఐటీ రిటర్న్స్‌లో పెద్ద ఎత్తున అవకతవకలు (discrepancies) జరిగినట్లు ఐటీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. పన్ను చెల్లింపుల్లో తేడాలు ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాతే ఈ సోదాలు ప్రారంభించారు.
రాజేంద్రనగర్‌లోని పిస్తా హౌస్ యజమానులు మహమ్మద్ మజీద్ మరియు మహమ్మద్ అబ్దుల్ మోషీ ఇళ్లలో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈ తనిఖీల్లో భాగంగా, ఐటీ అధికారులు ఉద్యోగుల నుంచి కొన్ని కీలక డాక్యుమెంట్లు, అలాగే కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ డాక్యుమెంట్లను పరిశీలించడం ద్వారా పన్ను ఎగవేత ఏ స్థాయిలో జరిగింది అనేదానిపై పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. హైదరాబాద్ రెస్టారెంట్ వర్గాల్లో ఈ ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి.
Also Read:ఏసీబీ వలలో టెక్మాల్ పీఎస్ ఎస్‌ఐ

