- Advertisement -
మినీ మేడారం జాతర వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి సీతక్క. అర్థరాత్రి వనదేవతలు సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్నారు సీతక్క. అమ్మల గద్దెలపై మొక్కులు చెల్లించుకుని, రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్లు వెల్లడించారు. సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రతిబింబించే ఈ పవిత్ర జాతరలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు సీతక్క.
13న సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద పసుపు కుంకుమతో అమ్మవార్లను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు . ఫిబ్రవరి 14న భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు వీలు కల్పించనున్నారు. 15న అమ్మవార్లకు ఆలయ పూజారులు గిరిజన సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహిస్తారు. దీంతో మండ మెలిగే పండుగ ఘట్టం ముగుస్తుంది.
Also Read:వృక్షార్చన..మొక్కలు నాటిన కడియం నర్సరీ రైతులు
- Advertisement -

