సికింద్రాబాద్ ఆడబిడ్డ అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. సీతాపల్ మండి వారాసిగూడకు చెందిన చింతల రమ్యప్రియ బ్యాటరీతో నడిచే బైక్‌ను తయారుచేశారు.నగరంలో ఓ కాలేజీలో ఎంబీఏ చేస్తున్న రమ్య చిన్నప్పటి నుంచి ఏదైనా కొత్తగా చేయాలని పరితపించేది. ఇందులో భాగంగా పొల్యూషన్ లేని బైక్‌ని తయారుచేయాలనుకుంది.
ఇందుకోసం రీసెర్చ్ చేసింది. తన సుదీర్ఘ రీసెర్చ్ అనంతరం జీరో పొల్యూషన్ గల బైక్‌ను తయారుచేసింది. దీనికి మూడు గంటలు చార్జింగ్ పెడితే చాలు 40కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. ఈ బైక్‌కు జీరో పొల్యూషన్ ఎలక్ట్రిక్ పెడల్ బైక్ అని పేరు పెట్టింది.
ఈ బైక్ ప్రత్యేకత ఏంటంటే ఒక వేల చార్జింగ్ అయిపోయినా పెడల్ ను ఉపయోగించి సైకిల్ లాగా తొక్కుకుంటూ రావొచ్చూ. ఈ బైక్ తయారీకి 25 వేల నుంచి 35 వేల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా రమ్యను అభినందించారు డిప్యూటీ స్పీకర్ పద్మారావు.
తాళం చెవి ఇగ్నిషన్ ఆన్ చేసి ఎక్స్ లెటర్ ఇస్తే చాలు ఎలాంటి చప్పుడు,పొగ లేకుండా వెళ్తుందని రమ్య తెలిపారు. 600కిలోల బరువుతో కూడా ఈ బైక్ 25 నుంచి 30 కిలో మీటర్ల వేగంతో వెళ్తుందని తెలిపారు.