రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఎల్బీ నగర్ డీసీపీ సంప్రీత్ సింగ్ విసిరిన ఛాలెంజ్ స్వీకరించి ఈరోజు సికింద్రాబాద్ నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ కల్మశ్వర్ శింగనెవార్ ఐపీఎస్ మొక్కలు నాటారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం దేశంలో ఎక్కడలేని విధంగా సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్గ్మకంగా హరితహారం కార్యక్రమం చేపట్టి మొక్కలు పెంచుతున్నారు. వాటిని కాపాడే విధంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు.
భారతదేశ పచ్చదన సరసారిలో 33శాతం ఉండాలి అని, దానికి అనుకుణంగా చక్కటి ప్రణాళిక తయారుచేసి 29% పచ్చదనం సాధించగలిగారు. దీనికి మద్దతుగా ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టి మొక్కల పెపంపకం పైన మంచి అవగాహనా కల్పిస్తున్నారు. ఇంతటి మంచి కార్యక్రమం చేపట్టి ఎంపీ సంతోష్ కుమార్ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ నార్త్ జోన్లో తన సహచర సిబ్బంది అందరు పాల్గొనాలని కోరారు.