అభివృద్ది ఎవరు చేస్తున్నారో చూసి ఓటెయ్యండి- మంత్రి ఎర్రబెల్లి

210
Minister Errabelli
- Advertisement -

ములుగు, భూపాలపల్లి నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమాయత్త సమావేశానికి ముఖ్య అతిథిగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరైయ్యారు. ఈ సమావేశాల్లో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, జెడ్పీ చైర్మన్లు కుసుమ జగదీష్, శ్రీ హర్షిని రాకేష్, పలువురు రాష్ట్ర, జిల్లా, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఓటు హక్కును వినియోగించుకునే ముందు పట్టభద్రులు ఒక్కసారి ఆలోచన చేయాలి. అభ్యర్థుల గుణగణాలు, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలను ఒక్క సారి పరిశీలించి నిర్ణయం తీసుకోండి. అభివృద్ది ఎవరు చేస్తున్నారో చూసి ఓటెయ్యండి అని మంత్రి సూచించారు. కరోనా కష్ట సమయంలో కూడా అప్పు చేసి రైతులకు రైతు బంధు ఇచ్చిన వ్యక్తి కెసిఆర్. మాకు జీతాలు లేకున్నా మీకు కష్టం రాకుండా జాగ్రత్త పడుతున్నాం. మన దగ్గరి నుండి రెండు చేతులతో నిధులు తీసుకుంటూ… కేంద్ర ప్రభుత్వం అందులో పావలా కూడా మనకు ఇస్తలేదని మంత్రి మండిపడ్డారు.

విభజన చట్టంలో ములుగుకి విశ్వవిద్యాలయం ఇస్తామని చెప్పి, మన ప్రభుత్వం స్థలం,నిధులు ఇస్తామన్నా కూడా, కేంద్రం దగ్గర ఉలుకు పలుకు లేదు. బయ్యారం ఫ్యాక్టరీ నిర్మిస్తామన్నారు ఇప్పటి వరకు ఫ్యాక్టరీ నిర్మాణం గురించి కేంద్రం మాట్లాడింది లేదు. అలాగే కాజీపేట రైల్వే ఫ్యాక్టరీ కావాలని మనం ఎన్ని సార్లు కోరినా కేంద్రంలో చలనం లేదు. గుజరాత్‌లో టెక్స్‌టైల్ పార్క్కు నిధులు ఎన్నైనా మంజూరు చేస్తారు కానీ వరంగల్‌లో దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్‌కి మాత్రం మద్దతు పలకరు అని ఎర్రబెల్లి విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా అడిగితే ఇప్పటి వరకు ఇవ్వలేదు. నీతి అయోగ్ తెలంగాణకు నిధులు ఇవ్వాలని సూచించినా కూడా కేంద్రం మంజూరు చేయదు. ఇన్ని తప్పులు కేంద్రం వి పెట్టుకొని, తెలంగాణ మొత్తం మా నిధులతో నడుస్తుందని ఇక్కడోల్లు డప్పు కొడతరు. ఇప్పటి దాకా మనకేమీ చెయ్యనోళ్ళు, రేపు మనకేం చేస్తారు. తల్లికి బువ్వ పెట్టనోడు, చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తడంటే మనం నమ్మాలా.. కెసిఆర్ తలలో నాలుకలా పని చేస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డిని మనమంతా కలిసి గెలిపించుకోవాలని మంత్రి ఎర్రబెల్లి ఈ సందర్భంగా కోరారు.

- Advertisement -