సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ప్రారంభమైంది. ఈరోజు ఆషాడ బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి బంగారు బోనం, అమ్మవారికి బియ్యం సమర్పించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు. ఈ సందర్భంగా మంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఈఓ మనోహర్ రెడ్డి పండితులు. భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని ఏర్పాట్లను చేయడం జరిగిందని..భక్తులు తప్పని సరిగా కోవిడ్ జాగ్రత్తలు పాటించాలి. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని అమ్మ వారిని కోరుతున్నా అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
బోనం ఎత్తుకుని వచ్చే మహిళా భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్‌లు ఏర్పాటు చేశారు. జాతర సందర్భంగా 2,500 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టారు. మాస్కు ధరించని వారిని అమ్మవారి దర్శనం కోసం అనుమతించమని పోలీసులు తెలిపారు. ఇవాళ సీఎం కేసీఆర్ మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. సోమవారం రంగం వేడుక నిర్వహించనున్నారు.