ఇద్దరు మహిళలపై అత్యాచారం కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం డేరా బాబా రామ్ రహీమ్ సింగ్ గుర్మీత్ కు కోర్టు 20 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. డేరాలో సుఖాలను చూసిన బాబా జైలులో గోడలతో మాట్లాడుతూ.. కేకలు పెడుతున్నాడు. డేరా స్వచ్ఛ సౌదలో నమ్మలేని నిజాలు బయట పడుతున్నాయి.
గుర్మిత్ ఆశ్రమంలోని ఓ అల్మారాలోనుంచి ఓ రహస్య తలుపు ఉండటం చూసిన హర్యానా అధికారులు షాక్ కు గురయ్యారు. హర్యానా రాష్ట్రంలోని సిర్సా కేంద్రంగా ఉన్న ఈ డేరాలో బాలికల అల్మారాలో ఈ రహస్య తలుపును అధికారులు గుర్తించారు. డేరాబాబా ఆశ్రమంలో బాలికలను ఖాళీ చేయించిన అధికారులు వారున్న పెద్ద గదిలోని ఓ అల్మారాను తెరవగా డేరాబాబా రహస్య తలుపు కనిపించింది. ఈ తలుపు గుండా వెళితే ఆశ్రమం నుంచి గుహలోకి వెళ్లే మార్గాన్ని గుర్మిత్ నిర్మించుకున్నాడని అధికారుల పరిశీలనలో తేలింది. ఆశ్రమంలో బాలికలు నివాసముంటున్న గదిలోకి డేరాబాబా తన గుహ నుంచి రహస్యంగా వచ్చేందుకు ఈ మార్గాన్ని నిర్మించాడని అధికారులు అనుమానిస్తున్నారు. బాలికల పాఠశాల, స్కూలు ఉన్న ప్రాంతంలోనే కొత్త డేరాను గుర్మిత్ నిర్మించుకొని అక్కడే ఎక్కువ సమయం ఉండేవాడని అధికారుల దర్యాప్తులో తేలింది.
మరోవైపు డేరా బాబా తాను అనుభవించాలనుకున్న సాధ్విల భర్తలని నపుంసకులని చేసేవాడని, అడ్డు అనిపించిన వాడిని హత్య చేసి తొలగించుకునే వాడనే అతడి అనుచరులు వెల్లడించారు. తాజాగా మాజీ జర్నలిస్టు రామానంద్ తతియా భయంకరమైన ఆరోపణలు చేశాడు. డేరా బాబా చేసిన హత్యల సంఖ్య వందల్లో ఉంటుందని, డేరా స్వచ్ఛ సౌదని జల్లెడ పట్టి తవ్వకాలు, గాలింపు జరిపితే కనీసం 500 మానవ ఆస్థి పంజరాలు బయట పడతాయని బాంబు పేల్చాడు.