రాజ’శేఖర్’ నుండి రాబోతున్న సెకండ్ సింగిల్..

173
- Advertisement -

టాలీవుడ్‌ యాంగ్రీమన్‌ రాజశేఖర్ ప్రస్తుతం ‘శేఖర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీకి జీవితరాశేఖర్‌ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ వదలనున్నట్టు ఒక పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఫిబ్రవరి 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రాజశేఖర్ కూతురు పాత్రలో, ఆయన పెద్ద కూతురు శివాని నటిస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చారు. మలయాళంలో ‘జోసెఫ్’ సినిమాకి ఇది రీమేక్. పద్మకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో రాజశేఖర్‌ రిటైర్మెంట్ తీసుకున్న ఒక పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.

- Advertisement -