ఐటీ వీకేంద్రీకరణలో భాగంగా ఖమ్మం జిల్లాకు మరో ఐటీ టవర్ రానుంది. ఈ మేరకు రెండో ఐటీ టవర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. రూ.36కోట్ల వ్యయంతో 55వేల చదరపు అడుగుల్లో టవర్‌ను నిర్మించనున్నారు. ప్రత్యక్షంగా 570 మంది ఒకేసారి పని చేసుకునేలా సువిశాలమైన భవన నిర్మాణం చేపట్టనున్నారు. త్వరలో ఆయా టవర్ నిర్మాణ పనులకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శంకుస్థాపన చేయనున్నారు.
ఇప్పటికే ఖమ్మంలోని ఇల్లందు సర్కిల్ వద్ద ప్రస్తుతం ఐటీ హబ్-1 ఇప్పటికే ప్రారంభించగా.. సేవలు నిర్విరామంగా సాగుతున్నాయి. టవర్ నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ఫస్ట్ ఫేజ్లో దాదాపు 5 అంతస్తుల్లో రూ. 27 కోట్లతో నిర్మించిన ఈ ఐటీ హబ్ ద్వారా వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు లభించగా 16 కంపెనీలు పనిచేస్తున్నాయి.ఇప్పటకే వరంగల్, కరీంనగర్ లో కూడా ఐటీ హబ్ లు ప్రారంభమైన సంగతి తెలిసిందే.