- Advertisement -
కరోనా వైరస్ విజృంభనతో చైనాలో ఇప్పటికే 310 మంది మృత్యువాతపడ్డారు. 20 దేశాలకు వైరస్ వ్యాప్తి చెందింది. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఈ వైరస్ భారత్‌లో కూడా ప్రవేశించింది. ఇప్పటికే కేరళ రాష్ట్రంలో ఓ కేసు నమోదుకాగా, తాజాగా రెండో కరోనా వైరస్ కేసు నమోదైంది. మరో కేసు బయటపడడంతో దేశీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
చైనాలోని వుహాన్ నగరంలో వైద్య విద్య అభ్యసిస్తున్న ఓ విద్యార్థిని కరోనా వైరస్ బారిన పడినట్లు మూడు రోజుల క్రితం గుర్తించిన విషయం తెలిసిందే. ఆమెను ప్రత్యేక గదిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. తాజాగా చైనాలో పర్యటించి వచ్చిన ఓ వ్యక్తి కూడా వైరస్ బారిన పడినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం బాధితుడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందజేస్తున్నట్లు కేంద్ర వైద్యవర్గాలు తెలిపాయి.
- Advertisement -