ఏపీలో సీఫుడ్ నెట్ వర్కింగ్‍:లోకేష్

5
- Advertisement -

ఆస్ట్రేలియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. సీఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా సీఈఓ వెరోనికా పాపాకోస్టా, ఎంగేజ్‌మెంట్ మేనేజర్ జాస్మిన్ కెల్లెహెర్‌లతో లోకేష్ భేటీ అయ్యారు.

2024-25లో రూ.66 వేల కోట్లు విలువైన భారతదేశ సముద్ర ఆహార ఎగుతమత్తులో ఏపీ వాటా 60 శాతం ఉందని లోకేష్ తెలిపారు. ఆస్ట్రేలియాతో సముద్ర ఆహార వాణిజ్య భాగస్వామ్యాన్ని మరింత పెంచడంపై చర్చించినట్లు వెల్లడించారు.

ఏపీలో సముద్ర ఆహార పరిశ్రమకు పెట్టుబడులు పెట్టాలని కోరారు లోకేష్. ఏపీ సీఫుడ్ పరిశ్రమ నెట్ వర్కింగ్‍ కు సహకారం అందించండి.. ఆక్వా ఉత్పత్తుల నాణ్యత పెంపునకు కలిసి పనిచేయండి అన్నారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతితో ఏపీ భారత్‍ లో అగ్రగామిగా ఉంది..ఆక్వా ఉత్పత్తుల ఎగుమతితో ఏపీ 60 శాతానికి పైగా వాటా కలిగి ఉంది అన్నారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారులను అనుసంధానానికి కార్యక్రమాలు చేపట్టండి.. భారత సముద్ర ఉత్పత్తుల మార్కెట్ విస్తరణ కోసం సహకరించండి..పరిశ్రమదారులు, దిగుమతిదారుల మధ్య భాగస్వామ్యం సులభతరం చేయండి అన్నారు.

Also Read:పోలీసుల త్యాగాలను మర్చిపోలేం:రేవంత్

- Advertisement -