పోలీసులపై జాతీయ ఎస్టీ కమిషన్ సీరియస్

7
- Advertisement -

సైబరాబాద్ పోలీసులపై జాతీయ ఎస్టీ కమిషన్ సీరియస్ అయింది. కమిషనర్ విచారణకు రాకపోతే డీజీపీని రప్పించాల్సి ఉంటుంది అని తెలిపింది. హీరో విజయ్ దేవరకొండ కేసు విచారణకు కమిషనర్ రాకుండా ఏసీపీ రావడం పట్ల అసహనం వ్యక్తం చేసింది జాతీయ ఎస్టీ కమిషన్.

ఏప్రిల్ 26వ తేదీన రెట్రో సినిమా వేడుకలో గిరిజనుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విజయ్ దేవరకొండపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు. ఇదే అంశంపై జాతీయ ఎస్టీ కమిషన్ కు కూడా ఫిర్యాదు చేయడంతో, విచారణ చేపట్టారు కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్.

ఈ నేపధ్యంలో విచారణకు హాజరు కావాలని కమిషనర్ కు నోటీసులు ఇస్తే మీరెందుకు వచ్చారు. ఆ మాత్రం తెలియదా అంటూ మాదాపూర్ ఏసీపీ పట్ల అసహనం వ్యక్తం చేశారు హుస్సేన్ నాయక్. మరో 15 రోజుల్లో హైదరాబాద్ కమిషనర్ విచారణకు హాజరు అవ్వకపోతే, డీజీపీని విచారణకు రప్పించాల్సి ఉంటుందని ఏసీపీని హెచ్చరించింది జాతీయ ఎస్టీ కమిషన్.

Also Read:గురు పౌర్ణమి..కాళోజీ కళాక్షేత్రం

- Advertisement -