రాష్ట్రంలో పాఠశాలలు పునః ప్రారంభం..

266
Schools Reopen
- Advertisement -

కరోనా కారణంగా దాదాపు ఏడు నెలలుగా మూతబడిన విద్యాసంస్థలు తెలంగాణలో నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. తొమ్మిది, పది తరగతులతోపాటు ఇంటర్‌, డిగ్రీ, పీజీ కాలేజీల విద్యార్థులు కొవిడ్‌ నిబంధనలు పాటించేలా విద్యాలయాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరోనా నేపథ్యంలో బడుల్లో ప్రార్థనలు, స్కూల్‌ అసెంబ్లీలు జరుపొద్దని విద్యాశాఖ నిర్ణయించింది. అయితే, పిల్లలను బడికి పంపేందుకు తమకు అభ్యంతరం లేదన్న తల్లిదండ్రుల లేఖ ఉంటేనే విద్యార్థులను అనుమతిస్తారు. పాఠశాల తరగతి గదిలో విద్యార్థుల మధ్య ఆరడుగుల దూరం తప్పనిసరి. క్లాస్ రూములో 20 మంది విద్యార్థులను మాత్రమే అనుమతిస్తారు. మధ్యాహ్న భోజనం, టాయిలెట్లు, చేతులు శుభ్రం చేసుకునే ప్రాంతాల్లో గుండ్రని గీతలు గీశారు. విద్యార్థులు వాటి ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది.

ప్రతి స్కూల్‌లోనూ ఓ ఐసోలేషన్ గదిని ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే ఆ గదికి పంపించి తల్లిదండ్రులకు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం అందిస్తారు. అవసరమైన విద్యార్థులకు ప్రాథమిక వైద్యం అందించేందుకు వైద్యులు 24 గంటలూ అందుబాటులో ఉంటారు. తెలంగాణలోని 970 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ గురుకుల పాఠశాలలు కూడా నేటి నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. ప్రత్యక్ష తరగతులతోపాటే ఆన్‌లైన్‌ క్లాసులు సైతం కొనసాగనున్నాయి.

- Advertisement -