అమరావతిలో శ్రీమంతుడి స్కూల్

240
school-for-poor-childrens-organizing-by-mahesh-babu
- Advertisement -

ప్రిన్స్ మహేష్ బాబు” సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన హ్యాండ్ సమ్ హీరో. సినిమాల్లోకి వచ్చిన కొద్ది కాలానికే ఎంతో మంది మహిళా అభిమానులను సంపాదించుకున్నారు.మహేష్ బాబు సినిమా విడుదల అవుతుంది అంటేనే అభిమానుల్లో భారీ క్రేజ్ ఉంటుంది. వరుసగా సినిమాలు చెయ్యకపోయినా ఏడాదికో రెండేళ్ళకో ఒకసారి ప్రేక్షకుల ముందుకి వచ్చినా మహేష్ పాపులారిటీ మాత్రం ఎక్కడా తగ్గలేదనే చెప్పాలి.

school-for-poor-childrens-organizing-by-mahesh-babu

మహేష్‌ బాబు శ్రీమంతుడు చిత్రం తర్వాత అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఆంద్ర ప్రదేశ్‌లో బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న మహేష్‌ తెలంగాణలో సిద్ధాపూర్ గ్రామాన్ని అడాప్ట్ చేసుకొని పలు అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నాడు. మహేష్‌ భార్య నమ్రత కూడా ఈ కార్యక్రమాలలో చాలా చురుగ్గా పాల్గొంటూ తన వంతూ సాయం అందిస్తుంది. అయితే మహేష్‌ ఇప్పుడు మరో అడుగు ముందుకేసి అమరావతిలో ప్రతిభ గల పేద విద్యార్ధుల కోసం అన్ని సౌకర్యాలతో కూడిన ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట.

సాధారణంగా సినీ సెలబ్రిటీలు ఫైవ్ స్టార్ హోటల్స్ నో, సినీ స్టూడియోలనో నిర్మించడానికి మొగ్గు చూపుతుంటారు. కానీ అందుకు విరుద్ధంగా మహేష్ మాత్రం ఓ అంతర్జాతీయ స్కూల్ ను ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత గుంటూరు ఎంపీ, తన బావ గల్లా జయదేవ్ సూచనల మేరకే ఈ ప్రాజెక్ట్ ను తీసుకోవాలని ప్రిన్స్ నిర్ణయించుకున్నట్లుగా సమాచారం.

ఇప్పటికే గుంటూరు జిల్లా, బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుని విద్య, వైద్య కార్యక్రమాలపై దృష్టి సారించిన మహేష్, తాజాగా అదే జిల్లా అయిన అమరావతి వైపు మొగ్గు చూపడం విశేషం.ప్రస్తుతం మహేష్‌ స్పైడర్ తో పాటు భరత్ అను నేను చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఒక్క సాంగ్ మినహా షూటింగ్ అంతా పూర్తి చేసుకున్న స్పైడర్ చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కానుంది. భరత్ అను నేను చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

- Advertisement -