జమ్మి మొక్కలు నాటిన సింగరేణి డైరెక్టర్ ఎన్‌ బలరాం..

202
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం,రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజు సింగరేణి డైరెక్టర్,ఎన్‌ బలరాం నాయక్, ఐఆర్‌ఎస్‌, (డైరెక్టర్ పా, ఫైనాన్స్ మరియు ప్రాజెక్ట్స్ &ప్లానింగ్ ) జమ్మి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జమ్మి చెట్టు విలువను తెలియజేస్తూ సింగరేణి వ్యాప్తంగా అన్నిగనులలో ఉన్న గుడులు, కాలనీలో ఉన్న గుడులు మరియు కాళీ స్థలంలో ఈ మొక్కను నాటలని కోరారు. పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తిని చాటాలని ఆర్‌కేపీ ఓసీపీ, మందమర్రి ఏరియా మరియు ఆర్‌కే 5 ఇంక్లైన్, శ్రీరాంపూర్ ఏరియాలో జమ్మి మొక్కలను నాటి.. ఈ కార్యక్రమం మొత్తం సింగరేణిలో జరగాలని ఆదేశాలు జారి చేశారు.

ఈ కార్యక్రమంలో రవి ప్రసాద్ ఎస్‌ఓ టూ డైరెక్టర్‌, చింతల శ్రీనివాస్ జీఎం మందమర్రి, ఎమ్‌ సురేష్ జీఎం శ్రీరాంపూర్, శ్రీ బానోత్ కర్ణ నాయక్ డీజీఎం ఫారెస్ట్రీ, పురషోత్తం పీఆర్‌ఓ సంతోష్ కుమార్, మధుసూదన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆర్‌ ఓసీపీ, జక్కారెడ్డి సీఎంఓఏఐ, ఏరియా ప్రెసిడెంట్, గుప్త So to GM Srp, శ్రీరాంపూర్ మరియు మందమర్రి ఏరియా గనుల ఏజెంట్లు, మేనేజర్లు మరియు సిబ్బంది పాల్గోన్నారు.

- Advertisement -