బ్యాంకాక్ లో భారతీయ మహంతం(ద లీడర్) అవార్డును అందుకున్నారు సింగరేణి సి&ఎం.డి ఎన్.శ్రీధర్.ప్రముఖ ఏషియావన్ పత్రిక ఆధ్వర్యంలో నిన్న రాత్రి (శుక్రవారం, ఫిబ్రవరి 7వ తేదీ) జరిగిన 13వ ఏషియన్ బిజినెస్ అండ్ సోషల్ ఫోరమ్ సదస్సులో అవార్డును స్వీకరించారు.
మొరాకో దేశ రాయబారి అబ్దెలిల్లాప్ హోస్ని, మాల్దీవ్స్ రాయబారి మహ్మద్ జిన్నా నుండి అవార్డు అందుకున్నారు శ్రీధర్. ఆసియా దేశాల్లో అత్యంత ప్రతిభావంతులైన వారికి ఇచ్చే ‘‘భారతీయ మహంతం పురష్కార్ 2019-20’’ ని ‘ద లీడర్’ పేరుతో శ్రీ ఎన్.శ్రీధర్ కు బహుకరించారు నిర్వాహకులు.
ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖ వ్యాపార, వాణిజ్య పరిశ్రమల దిగ్గజాల సమక్షంలో అవార్డు స్వీకరణ కార్యక్రమం జరిగింది. సింగరేణిని గత ఐదేళ్ల కాలంలో దేశంలోనే కాక ఆసియా ఖండంలోనే అత్యధిక వృద్ధి రేటు సాధించిన కంపెనీగా నిలిపినందుకు అవార్డును ప్రకటించింది ‘ఏషియావన్’ (థాయ్ లాండ్) మ్యాగజైన్.
సింగరేణి గత ఐదేళ్లలో అమ్మకాలలో 78 శాతం, లాభాలలో 262 శాతం, బొగ్గు రవాణాలో 28 శాతం, బొగ్గు ఉత్పత్తిలో 23 శాతం సాధించిన నేపథ్యంలో శ్రీధర్‌ని ప్రతిభావంతనాయకునిగా అవార్డుకు ఎంపికచేసింది.
ఇది సింగరేణీయుల సమిష్టి కృషికి లభించిన అంతర్జాతీయ స్థాయి అవార్డు అన్నారు శ్రీధర్. మరింత వృద్ధి రేటుతో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాం…తెలంగాణ ఆవిర్భావం తర్వాతనే సింగరేణికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించిందన్నారు. వార్డు స్వీకరణోత్సవంలో సింగరేణి సి&ఎం.డి. నాయకత్వ ప్రతిభ, కార్మికుల సమిష్ఠి కృషిపై ప్రత్యేక డాక్యుమెంటరీ ప్రదర్శించారు.
ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు ఎన్.శ్రీధర్. ఇండియాస్ బెస్ట్ కంపెనీ అవార్డు (యు.ఎస్.ఎ), మేనేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు – 2018 (లండన్), అవుట్ స్టాండింగ్ గ్లోబల్ లీడర్ షిప్ అవార్డు – 2018 (దుబాయ్), ఏషియా ఫసిఫిక్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అవార్డు (ఎంటర్ ప్రైజ్ ఏషియా), గోల్డెన్ పీకాక్ అవార్డు (దుబాయ్)లు అందుకున్నారు.