ట్రెండింగ్: ఎఫ్ 3లో మహేష్..!

427
mahesh babu
- Advertisement -

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్,వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఎఫ్‌ 2 ( ఫన్ అండ్ ఫ్రస్టేషన్) బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌ ఎఫ్‌ 3 తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరవార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్‌తో పాటు మహేష్ బాబు కూడా నటించనున్నాడట.

అయితే గతంలో రవితేజ పేరు తెరమీదకు రాగ ఈ సారి మహేష్ పేరు టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్ర షూటింగ్ స‌మ‌యంలో అనీల్ రావిపూడి ఎఫ్ 3 ప్ర‌స్తావ‌న తేగా తాను నటిస్తానని హామీ ఇచ్చారట మహేష్. మరి ఈ వార్తలో ఎంతనిజం ఉందో లేదో తెలియదు గానీ ఈ ముగ్గురు కలిసినటిస్తే ఫ్యాన్స్‌కు పండగే.

- Advertisement -