నిద్రలేమి సమస్యతో మెదడుపై భారం పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే చాలా మంది నిద్ర సరిగా పోకపోయినా తాము బాగానే ఉన్నామని అనుకుంటారు. కానీ ఇది అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందనివెల్లడించారు.
కొంతమంది రాత్రంతా మేల్కొని పనిచేస్తున్నానని మీరు అనుకుంటారు, కానీ మీ మెదడు మాత్రం అది అంగీకరించదు.ఓ పరిశోధనలో ఇదే తేలింది. నిద్ర లేకుండా ఉన్నప్పుడు మెదడు కొన్ని క్షణాలపాటు “ఆఫ్‌లైన్” మోడ్‌లోకి వెళ్తుందని తేలింది. ఈ “మైక్రో-స్లీప్ స్టేట్స్” అనేవి కేవలం కొన్ని సెకన్లపాటు మాత్రమే కొనసాగుతాయి — కానీ ఈ సమయంలో మీ మెదడు యొక్క కొంత భాగం నిద్రలో ఉన్నట్టు ప్రవర్తిస్తుంది, మీరు మెలకువగా కనిపించినా!
26 మంది పెద్దవారిపై రెండు పరిస్థితుల్లో అధ్యయనం చేశారు. రాత్రి పూర్తి విశ్రాంతి తీసుకున్న తర్వాత, మరో రాత్రి నిద్ర లేకుండా ఉండిన తర్వాత. ఇందుకు సంబంధించిన ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. నిద్ర లేకుండా ఉన్నప్పుడు, వారి మెదడులో కొన్ని క్షణాలు డీప్ స్లీప్ తరహా తరంగాలు మరియు సెరెబ్రోస్పైనల్ ద్రవ చలనం కనిపించాయి.
నిద్ర లేకపోవడం గుండె ప్రతిస్పందన సమయాన్ని తగ్గిస్తాయి. సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. జ్ఞాపకశక్తిని డిస్ట్రబ్ చేస్తాయి. శ్వాస రిథమ్‌లో, కంటి ప్రతిచర్యల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. అలాగే నర్వస్ సిస్టమ్ సమతుల్యత కోల్పోతుంది. నిద్ర లేమి ఆందోళన, గుండె సంబంధిత వ్యాధులు, అల్జీమర్స్ ప్రమాదం పెరగడానికి కూడా కారణమవుతుంది.ఈ సమస్యకు పరిష్కారం.. నిద్రే. స్థిరమైన నిద్ర సమయాన్ని పాటించండి.సరైన ఆహారం మరియు నీరు తీసుకోండి. నిద్రకు 6 గంటల ముందు కాఫీన్, ప్రకాశవంతమైన లైట్లు తగ్గించండి.
Also Read:స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు?

