నేటి రోజుల్లో రోజుకో కొత్తరకం వ్యాధులు, రోగాలు పుట్టుకొస్తున్నాయి. వాటి లక్షణాలు సాధారణంగానే కనిపిస్తున్నప్పటికి.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు తీసుకొస్తున్నాయి. ఇక తాజాగా ” స్కార్లెట్ జ్వరం ” అనే కొత్తరకం వైరల్ ఫీవర్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల పిల్లలే ఈ వ్యాధి బారిన ఎక్కువగా పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ జ్వరం సోకిన వారు దగ్గిన, తుమ్మిన తుంపర్ల ద్వారా ఇతరులకు కూడా ఈ వైరల్ ఫీవర్ సోకే ప్రమాదం ఉందట. దీనిని సాధారణ జ్వరంగా భావించి నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ జ్వరం సోకిన వారిలో ప్రధానంగా గొంతు నొప్పి, తలనొప్పి, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇంకా నోరు పొక్కడం, గొంతులో మంట, నాలుక, పెదాలు ఎర్రగా కందినట్లు కనిపించడం, శరీరంపై దద్దుర్లు, నీరసం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్న మాట. ఈ స్కార్లెట్ జ్వరం పట్ల నిర్లక్ష్యం వహిస్తే పిల్లల్లో న్యుమోనియాకు దారి తీసే అవకాశం ఉంది. అలాగే కీళ్ల సమస్యలు, గుండె, కిడ్నీల పనితీరు మందగించడం వంటి సమస్యలు కూడా ఏర్పడతాయట.
కాబట్టి దీనిని వైరల్ ఫీవర్ గా భావించకుండా సరైన టైమ్ లో వైద్యుల సలహా మేరకు మెడిసన్ వాడడం ఉత్తమం. ఇక ఈ వ్యాధి బారిన పడకుండా పిల్లల పట్ల తగు జాగ్రత్తలు పాటించాలి. పిల్లలను పరిశుభ్రంగా ఉంచడం, అలాగే చుట్టూ ఉండే పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవడం చేయాలి. ఇంకా కలుషిత నీరు, కలుషిత ఆహారానికి దూరంగా ఉండాలి. ఇంట్లోకి దోమలు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని అందించాలి. ఇలా కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల పిల్లల్లో వచ్చే స్కార్లెట్ జ్వరాన్ని అధిగమించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read:IPL:ఆరంభం నుంచి ఆడుతున్న ప్లేయర్స్ వీరే!