క్లైమాక్స్‌లో కన్నడ పాలిటిక్స్..నేడే బలపరీక్ష

191
SC will decide on the Protem speaker
- Advertisement -

కర్నాటక రాజకీయాలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. సభలో మెజారిటీ నిరూపించుకునే వరకు విధానపరమైన నిర్ణయాలేవీ తీసుకోవద్దని కర్ణాటక గవర్నర్, ప్రభుత్వానికి సూచించిన సుప్రీం.. ఇవాళ సాయంత్రం 4 గంటలకు బలపరీక్ష నిర్వహించాలని సూచించింది. హస్య ఓటింగ్ కు సుప్రీంకోర్టు అనుమతించక పోవడంతో… హెడ్ కౌంట్ నిర్వహించాల్సి ఉంటుంది.

అసెంబ్లీలో బీజేపీకి 104 మంది ,కాంగ్రెస్‌ ఖాతాలో 78 సీట్లు, జేడీఎస్‌ ఖాతాలో 37 సీట్లు,బీఎస్పీ నుంచి ఒకరు, ఇద్దరు ఇండిపెండెంట్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. కుమారస్వామి రెండు చోట్ల నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో జేడీఎస్‌‌కు 36 మంది ఎమ్మెల్యేలే ఉన్నట్టుగా భావించాలి. దీంతో 111 మంది మద్దతు పలికితేనే యడ్యూరప్ప సర్కారు గెలిచినట్లవుతుంది.

ప్రొటెం స్పీకర్ నియామకాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం 10.30కి విచారణ జరపనుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్వీ దేశ్‌పాండే‌ సీనియర్ అయినప్పటికీ.. గవర్నర్ మాత్రం బీజేపీ నేత బోపయ్యవైపే మొగ్గు చూపడం పట్ల కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది.

బీజేపీ నుంచి ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్,బీజేపీ హైదరాబాద్ లో క్యాంప్ పెట్టాయి. అర్ధరాత్రి ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్‌ నుంచి ఎమ్మెల్యేల బృందం బయలుదేరింది. మొత్తం ఐదు బస్సులో ఎమ్మెల్యేలను తరలించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలకు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

- Advertisement -