ఇండిగో అధికారుల నిర్వాకం..అట్రాసిటీ కేసు

4
- Advertisement -

విమానం నడిపే అర్హత లేదు.. చెప్పులు కుట్టుకో అంటూ దళిత ట్రైనీ పైలెట్‌ను అవమానించారు ఇండిగో ఎయిర్ లైన్స్ అధికారులు. బెంగుళూరుకు చెందిన 35 ఏళ్ల ట్రైనీ పైలెట్, గుర్‌గావ్ లోని ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రధాన కార్యాలయంలో తనకు జరిగిన అవమానంపై ఫిర్యాదు చేయగా, ముగ్గురు ఇండిగో అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు.

ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రధాన కార్యాలయంలో పైలెట్ ట్రైనింగ్ తీసుకుంటుండగా, అధికారులు కులం పేరుతో దూషిస్తూ, తన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీశారని ఆరోపించాడు ఓ యువకుడు.

నీకు విమానం నడిపే అర్హత లేదు.. వెళ్లి చెప్పులు కుట్టుకో.. ఇక్కడ కనీసం వాచ్ మన్ గా కూడా పనికిరావు అని తీవ్రంగా అవమానించారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను వృత్తి పరంగా బలిపశువును చేశారని ఫిర్యాదులో పేర్కొనడంతో, ఇండిగో అధికారులు తపస్ డే, మనీశ్ సాహ్ని, కెప్టెన్ రాహుల్ పాటిల్ పై కేసు నమోదు చేశారు పోలీసులు.

Also Read:అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడి

- Advertisement -