అమెరికా వీసా రావాలంటే..!

7
- Advertisement -

అమెరికా వీసా రావాలంటే ఇకపై సోషల్ మీడియా అకౌంట్ల చెక్ తప్పని సరి. ఇందుకు సంబంధించి అమెరికా రాయబార కార్యాలయం కీలక ప్రకటన చేసింది. సోషల్ మీడియా అకౌంట్లు చెక్ చేసిన తర్వాతే అమెరికా వీసా ఇస్తామని ప్రకటించింది.

“ప్రైవేట్”లో ఉన్న సోషల్ మీడియా అకౌంట్లు “పబ్లిక్”గా మార్చాలని, ఆ అకౌంట్లు పర్యవేక్షించిన తరువాతనే వీసా జారీ చేస్తామని ప్రకటించింది. తమ దేశ భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు, ఈ ప్రక్రియ వెంటనే అమలులోకి రానున్నట్టు ప్రకటించింది భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం.

అమెరికా వీసాకు దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరు తమ సోషల్ మీడియా అకౌంట్లను “పబ్లిక్” గా మార్చాలని పేర్కొంది అమెరికా రాయబార కార్యాలయం.

Also Read:అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడి

- Advertisement -