ఎస్సీ వర్గీకరణ జీవో రిలీజ్..

0
- Advertisement -

ఎస్సీ వర్గీకరణ జీవోను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. 56 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించింది ప్రభుత్వం. ఏ గ్రూపుకు 1%, బీ గ్రూపుకు 9%, సీ గ్రూపుకు 5 % చొప్పున రిజర్వేషన్లు కల్పించింది.

ఈ మేరకు తెలుగు, ఇంగ్లీష్‌, ఊర్దూ భాషల్లో గెజిట్‌ విడుదల చేసింది. గ్రూప్‌-1లో సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా వెనుకబడిన 15 కులాలను చేర్చి 1 శాతం రిజర్వేషన్‌ కల్పించింది.

గ్రూప్‌-2లో మాదిగ, దాని ఉపకులాల (18)కు 9 శాతం, గ్రూప్‌-3లో మాల, దాని ఉప కులాల (26)కు ఐదు శాతం కేటాయించింది. గ్రూప్‌-1లో 1,71,625 మంది, గ్రూప్‌-2లో 32,74,377 మంది, గ్రూప్‌-3లో 17,71,682 మంది ఉన్నారు.

- Advertisement -