- Advertisement -
ఎన్నికలు వచ్చాయంటే చాలు అధికారం కోసం పొలిటికల్ పార్టీలు ఉచిత హామీలు కురిపించి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటాయి. ఇందులో ఏ పార్టీ తక్కువేమి కాదు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ఇచ్చే ఉచిత హామీలపై న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరపుంది సుప్రీం.
ఉచిత హామీలిస్తూపోతే ఇండియా కూడా శ్రీలంకలా తయారవుతుందని పిల్‌లో ఆందోళన వ్యక్తం చేశారు.అసంబద్ధమైన ఉచిత హామీలు ఇచ్చే పార్టీల చిహ్నాలను స్తంభింపజేసి, నమోదును రద్దు చేసేందుకు ఉన్న అధికారాలను ఈసీ వాడేలా చూడాలని సుప్రీంకోర్టును కోరారు.
ఈ విషయంపై కేంద్రం నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఈ ఉచితాలు కొనసాగాలా, వద్దా అనేది మేం నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
- Advertisement -