త్రిసభ్య ధర్మాసనానికి ఉచిత వాగ్దానాల కేసు

30
sc
- Advertisement -

ఉచితాల అంశంలోని సంక్లిష్ట‌త నేప‌థ్యంలో కేసును త్రిస‌భ్య ధ‌ర్మాస‌నానికి రిఫ‌ర్ చేస్తున్న‌ట్లు సుప్రీంకోర్టు తెలిపింది. రాజ‌కీయ పార్టీలు ఇచ్చే ఉచిత వాగ్ధానాల అంశం గురించి ఇవాళ సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ అంశాన్ని నిపుణుల క‌మిటీ ప‌రిశీలించాల‌ని సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ తెలిపారు.

ఇవాళ తొలిసారి జ‌రిగిన లైవ్ స్ట్రీమింగ్‌లో ఈ కేసును విచారించారు. ఎన్నిక‌ల వేళ రాజ‌కీయ పార్టీలు ఉచిత వాగ్ధానాలు ఇస్తున్నాయ‌ని, ఆ పార్టీల గుర్తింపు ఎత్తివేయాల‌ని దాఖ‌లైన పిటిష‌న్ల‌పై విచార‌ణ జ‌రిగింది. ప్ర‌జాస్వామ్యంలో అస‌లైన శ‌క్తి ఓట‌రు వ‌ద్దే ఉంటుంద‌ని, వాళ్లే పార్టీల‌ను, అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తార‌ని సీజే ర‌మ‌ణ అన్నారు.

- Advertisement -