కర్నాటక బలపరీక్ష.. బోపయ్యకు లైన్ క్లీయర్

240
SC Line Clears pro tem speaker KG Bopaia
- Advertisement -

సస్పెన్స్ థ్రిల్లర్‌ని తలపిస్తున్న కర్నాటక రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రొటెం స్పీకర్ బోపయ్య నియామకాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్ధానం విచారణ చేపట్టింది. బోపయ్యనే బలపరీక్ష నిర్వహిస్తాడని పేర్కొంది. బలపరీక్ష మొత్తాన్ని అన్ని ఛానళ్లలో లైవ్‌లో చూపించాలని తెలిపింది. సీనియర్ సభ్యుడు ప్రొటెం స్పీకర్‌గా ఉండాలన్నది సంప్రదాయం మాత్రమేనని రాజ్యాంగ నిబంధన కాదని పేర్కొంది. దీంతో కాంగ్రెస్,జేడీఎస్‌లకు షాక్ తగిలినట్లైంది. మరోవైపు అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగుతోంది.

ప్రొటెం స్పీకర్ తరపున ముకుల్ రోహత్గీ, ఏజీ కేకే వేణుగోపాల్, ఎఎస్‌జీ మెహతా, కాంగ్రెస్, జేడీఎస్ తరపున అభిషేక్ సింఘ్వీ, రాం జెఠ్మలానీ, కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. బోపయ్య ట్రాక్ రికార్డ్ సక్రమంగా లేదని సిబల్ బెంచ్‌కు విన్నవించారు. కర్ణాటక శాసనసభలో ప్రొటెం స్పీకర్ బోపయ్యతో సమస్యలు ఉత్పన్నమవుతాయని వివరించారు. ప్రొటెం స్పీకర్‌గా బోపయ్యను విశ్వసించలేమన్నారు. ఆయన ఎంపికపై తమకు అభ్యంతరాలున్నాయని కోర్టుకు సిబల్ చెప్పారు. అయితే ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్ధానం బోపయ్య బలపరీక్ష నిర్వహించేందుకు అనుమతించింది.

- Advertisement -