మరుగుదొడ్డి గుంతను క్లీన్ చేసిన మెదక్ కలెక్టర్

266
dharmareddy
- Advertisement -

కలెక్టర్ అంటే ప్రభుత్వ పథకాల అమల్లో పార్టీలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపికచేసి, పారదర్శకమైన సేవ లను అందించడం. ఇక కలెక్టర్ వస్తున్నారంటే అధికారులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. కానీ హంగామాకు దూరంగా ఉండి ప్రభుత్వ పథకాల అమలులో తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్న ఈ కలెక్టర్ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంతకీ ఎవరాయన అనుకుంటున్నారా…ఆయనే మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి.

మరుగుదొడ్డి గుంతలోకి దిగారు. అందులోంచి మట్టిని తీసి బయట తట్టలో వేశారు. మలం మట్టిగా, సేంద్రియ ఎరువుగా మారిన విషయాన్ని పరిశీలించారు. ఆయనతో పాటే పలు రాష్ట్రాల అధికారులూ గమనించారు. పూణేలోని పండేరేవాడ గ్రామంలో జరిగిన ఈ సీన్ ఇప్పుడు సర్వత్రా చర్యనీయాంశంగా మారింది. స్వచ్చ భారత్ మిషన్ లో భాగంగా నిర్వహించిన ఓడిఎఫ్ వర్క్ షాప్ కు హాజరయ్యారు కలెక్టర్ ధర్మా రెడ్డి.

ఒక ప్రక్రియ ద్వారా టాయిలెట్ ను సేంద్రియ ఎరువులోకి మార్చారు. సేంద్రియ ఎరువులను టాయిలెట్ నుండి ఖాళీ చేస్తున్న స్థానిక సిబ్బందిని చూసిన మెదక్ కలెక్టర్ స్వయంగా టాయిలెట్ పిట్లోకి దిగి తన చేతులతో సేంద్రీయ ఎరువును ఖాళీ చేశాడు. అది పూర్తిగా సేంద్రీయ ఎరువుగా రూపాంతరం చెందడంతో దానిని ముట్టుకోవడానికి సంకోచించాల్సిన, సిగ్గుపడాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.

ఇటీవలె మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్…ధర్మారెడ్డిపై ప్రశంసలు గుప్పించిన సంగతి తెలిసిందే. నీటి తీరువా బకాయిలు 650 కోట్లను పట్టుబట్టి మాఫీ చేయించారని కొనియాడారు. ఇలాంటి కలెక్టర్లు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసలు గుప్పించారు.

- Advertisement -