సెక్స్‌ వర్కర్లను వేధించ‌కండి:సుప్రీం

182
Supreme court
- Advertisement -

సెక్స్ వ‌ర్క‌ర్ల‌ను వేధించ‌వ‌ద్ద‌ని పోలీసులు, మీడియాకు సూచించింది సుప్రీం కోర్టు. స్వచ్ఛంద వ్యభిచారం నేరం కాదని తీర్పును వెలువరించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులు, మీడియా పబ్లిషర్లకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

వ్యభిచార గృహాల‌పై దాడులు జరిపిన సమయంలో పట్టుబడిన సెక్స్‌ వర్కర్ల ఫొటోలను ఎట్టిపరిస్థితుల్లోనూ మీడియా టెలికాస్ట్ చేయరాదని స్ప‌ష్టం చేసింది. వారికి క‌నీస గౌర‌వ మ‌ర్యాద‌లు ఇవ్వాల‌ని..సెక్స్ వర్కర్లపై భౌతికంగా గానీ మాటలతో వేధించడం చేయ‌వ‌ద్ద‌ని తెలిపింది.

ఏ మీడియా లేదా పబ్లిషర్లు వారి ఫొటోలు ప్రచురించినా, గుర్తింపును వెల్లడించినా ఐపీసీ 354C ప్రకారం చర్యలు తీసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా తగిన మార్గదర్శకాలు జారీ చేయాల‌ని తెలిపింది.

సెక్స్‌ వర్కర్ల పట్ల పోలీసుల వైఖరి క్రూరంగా, హింసాత్మకంగా ఉంటుందని అయితే వారికి హక్కులు ఉంటాయని సూచించింది. ఈ విషయంలో పోలీసులు, ఇతర చట్టబద్ధ సంస్థలు సున్నితంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. రెస్క్యూ ఆపరేషన్ల పేరుతో సెక్స్‌ వర్కర్లు, ఇతరుల ఫొటోలు, వివరాలు టెలిక్యాస్ట్ చేయడం నిషిద్ధమని సుప్రీం సూచించింది. UIDAI జారీచేసే ప్రొఫార్మా సర్టిఫికెట్‌ను ఆధారంగా సెక్స్‌ వర్కర్లందరికీ ఆధార్‌కార్డు జారీ చేయాల‌ని ఆ స‌మ‌యంలో ఎక్క‌డా వారు సెక్స్ వ‌ర్క‌ర్ అని ప్ర‌స్తావించ‌రాద‌ని తెలిపింది.

- Advertisement -