- Advertisement -
ఢిల్లీలో కోవిడ్-19 (కరోనా) వైరస్ ప్రభావంతో సుప్రీంకోర్టులో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. సోమవారం నుంచి కొద్ది రోజుల పాటు ముఖ్యమైన కేసులు, అవసరమైన మేరకే ధర్మాసనాలు విచారణ చేపడతాయన్న సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ సంజీవ్ యస్ కల్గోంకర్ తెలిపారు.
కేసులకు సంబంధించిన న్యాయవాదులు, పిటిషన్‌దారుడు, ప్రతివాదికి మాత్రమే కోర్టులోకి అనుమతి ఉంటుందన్న సెక్రటరీ జనరల్ తెలిపారు. కరోనా వ్యాప్తి చెందకుండా కోర్టుకు వచ్చే అందరినీ దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు తీసుకున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా సుప్రీం కోర్టు జారీ చేసింది.
- Advertisement -