14న మరోసారి నీట్ పరీక్ష…

141
neet 2020
- Advertisement -

దేశంలో కరోనా నేపథ్యంలో విద్యార్థులకు మరోసారి నీట్ పరీక్ష రాసే అవకాశం కల్పించాలని కేంద్రానికి సూచించింది సుప్రీం కోర్టు. కరోనా కంటైన్‌మెంట్ జోన్లలో ఉండి నీట్ పరీక్ష రాయలేని వారికి ఈ నెల 14న మరోసారి నీట్ పరీక్ష నిర్వహించాలని సూచించిన సర్వోన్నత న్యాయస్ధానం..16న ఫలితాలు విడుదల చేయాలని వెల్లడించింది.

కోవిడ్19 నిబంధనలతో పటిష్ట చర్యలు, జాగ్రత్తల నడుమ సెప్టెంబర్ 13న పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా 15.97 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, దాదాపు 13 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ ర్యాంకుల ఆధారంగా దేశ వ్యాప్తంగా 542 మెడికల్ కళాశాలల్లోని 80,005 సీట్లను భర్తీ చేస్తారు. 313 డెంటల్ కాలేజీలలోని 26,949 సీట్లతో పాటు ఈ ఏడాది 1205 ఎయిమ్స్, 200 JIPMER సీట్లు కూడా భర్తీ చేయనున్నారు.

- Advertisement -