తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర ఆమోఘం..

869
SC and ST Commission Chairman Errolla
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని సింగరేణి భవన్‌లో ఆ సంస్థ చైర్మన్ అండ్‌ ఎండీ ఎన్.శ్రీధర్ ,ఐఏఎస్ ఆధ్వర్యంలో జరిగిన సింగరేణి కాలరీస్ సంస్థ రివ్యూ సమావేశానికి ఎస్సీ ఎస్టీ కమిషన్‌ చైర్మన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు..ఈ సమీక్ష సమావేశానికి కమిషన్‌ సభ్యులు నీలాదేవి,రంబాల్ నాయక్,నరసింహా,సింగరేణి సంస్థకు చెందిన ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల,కార్మికుల సంఘాల నాయకులు,సంబంధిత అధికారులు పాల్గోన్నారు.

Errolla Srinivas

ఈ సందర్భంగా చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. నాడు జరిగిన తెలంగాణ ఉద్యమంలో సింగరేణి సంస్థకు చెందిన ఉద్యోగుల,కార్మికుల పోరాట పటిమ ఆమోఘం.. సకలజనుల సమ్మెలో కార్మికులు పోరాడిన తీరు ఒక సమస్యపై సమాజంకోసం ఎలా పోరాడాలో నేటి తరాలకు,రాబోవు తరాలకు ఆదర్శవంతంగా నిలిచింది “అని అన్నారు.. గతంలో ఎన్నడూ లేనివిధంగా రోజు అత్యధిక లాభాలు వచ్చేలా సంస్థ పనిచేస్తున్నందుకు సంస్థ ఎండీ ఎన్ శ్రీధర్ ఐఏఎస్‌కి,సంస్థ ఉద్యోగులకు,కార్మికులకు కమిషన్‌ తరపున అభినందనలు తెలుపుతున్నాను. ఒక నిబద్ధత,నిజాయితీ పనిచేయాలనే పట్టుదల అధికారి ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయనడానికి శ్రీధర్ ఐఏఎస్ లాంటి అధికారిని ఉదాహారణగా చెప్పోచ్చు. కమీషన్ అంటే ఒకప్పుడు హైదరాబాద్ కే పరిమితం.. కాగితాలకే పరిమితమయ్యేదని అందరికీ తెల్సిందే.

Errolla Srinivas Speech

అయితే తెలంగాణ ఏర్పడినాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో కమిషన్‌ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన ప్రజలకోసం ఆహర్నిశలు పనిచేస్తూ వారి అభ్యున్నతికై పాటుపడుతుంది..సింగరేణి లాంటి ప్రభుత్వ రంగ సంస్థలో కార్మికులకు కల్పిస్తున్న సదుపాయాలు దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలో లేదు. ఇది సింగరేణి కార్మికులకు దక్కిన మహాగొప్ప వరం..సంస్థ ఎండీ పర్యవేక్షణలో ఉద్యోగులు, కార్మికులు కల్సిమెలిసి పని చేస్తూ సంస్థను లాభాల్లోకి నడిపిస్తుండటం అభినందనీయం.. సంస్థలో పోస్టుల భర్తీలో రూల్ అండ్ రిజర్వేషన్ పాటిస్తుండటం ఆయా ఆయా వర్గాలకు చాలా చాలా ధైర్యానిచ్చే శుభపరిణామం..సంస్థలో ఉన్న ఎస్సీ ఎస్టీ వర్గాల అభ్యున్నతికై సంస్థ తీసుకుంటున్న చర్యలు వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని అన్నారు..సంస్థలో ఉద్యోగుల సంఘాలు ఎప్పుడు సంస్థ యజమాన్యానికి ఉద్యోగులకు మధ్య సద్భావం కలిగి పనిచేసినప్పుడే కార్మికులకు,ఉద్యోగులకు మేలు జరుగుతుంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ రోజు సెలవు ఇవ్వడం సంస్థ ఎండీ కి కమిషన్‌ తరపున అభినందనలు తెలుపుతున్నామన్నారు.

SC and ST Commission Chairman

సీఎం కేసీఆర్ అనుక్షణం సింగరేణి సంస్థ యొక్క పనితీరుపై,ఉద్యోగులు,కార్మికుల గురించి ఆలోచించి పనిచేసే అధికారైన శ్రీధర్ ను  ఈ సంస్థకు చైర్మన్,కార్యనిర్వాహక డైరెక్టర్ గా నియమించారు.సంస్థలో ఉన్న ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన ఉద్యోగులను, కార్మికులను దృష్టిలో పెట్టుకుని శ్రీధర్ తీసుకుంటున్న చర్యలు బాగున్నాయి అని అన్నారు.. అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన ఆలోచన విధానాన్ని,ఆయన సిద్ధాంతాలతో మిగిలిన వర్గాల కోసం పనిచేస్తే అదే అంబేద్కర్ కు ఇచ్చే ఘననివాళి..అంబేద్కర్ ఆలోచనలు,సిద్ధాంతాలను ఆధారంగా తీసుకుని తెలంగాణ సర్కారు దేశంలో ఎక్కడ లేనివిధంగా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు జనాభా నిష్పత్తి ప్రకారం ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలంగాణది.

SC and ST Commission Chairman Errolla Srinivas

ఇది అప్పుడేప్పుడో బ్రిటీస్ వారు రూపొందించిన ఈ నియమాన్ని స్వాతంత్రం వచ్చి డెబ్బై రెండు ఏళ్లైన ఏ రాష్ట్రం కల్పించని విధంగా అన్ని డిపార్ట్మెంట్లోని ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీ ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించిన ఏకైక సీఎం కేసీఆర్. సంస్థ యజమాన్యం,ఉద్యోగులు,సంఘాల మధ్య సత్సంబంధాలుంటేనే ఆ సంస్థ బాగుంటది. సంస్థలో పనిచేసే ఉద్యోగులు,కార్మికులు,వాళ్ల కుటుంబాలు బాగుంటాయి. ఇదే విధంగా పనిచేసి సంస్థ బాగుకోసం కృషిచేయాలి.. సంస్థ బాగుంటేనే ఆ సంస్థలోని ఉద్యోగులు ,కార్మికులు బాగుంటారని అన్నారు.

- Advertisement -