డెబిట్ (ఏటీఎం) కార్డుల ద్వారా జరుగుతున్న మోసాలను అరికట్టడానికి కొందరి ఖాతాదారుల డెబిట్ కార్డులను ప్రక్షాళన చేసేందుకు ఎస్‌బీఐ సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో వినియోగదారుల డెబిట్ కార్డులను శాశ్వతంగా బ్లాక్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రక్షణ లేని, పాత ఏటీఎం కార్డులను రద్దు చేసే ప్రక్రియను భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) ప్రారంభించింది.
ప్రస్తుతం ఉన్న మాగ్నెటిక్ స్ట్రైప్ డెబిట్ కార్డులకు బదులుగా భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) ఆమోదించిన ఈవీఎం చిప్ డెబిట్ కార్డులను జారీ చేస్తోంది. ఆన్‌లైన్ మోసాలను నిరోధించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మాగ్నెటిక్ స్ట్రైప్ ఎస్‌బీఐ డెబిట్ కార్డులు ఉన్నవారు జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఉంది. ఏ క్షణంలోనైనా రద్దు చేస్తున్నట్లు ఓ మెసేజ్ రావచ్చు.
అందువల్ల ఎస్‌బీఐ ఖాతాదారులు తమ పాత కార్డులను ఈవీఎం చిప్ కార్డులతో మార్చుకోవాలి. వీటిని ఎస్‌బీఐ ఉచితంగానే ఇస్తుంది. కొత్త కార్డుల కోసం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా హోం బ్రాంచ్‌కు వెళ్ళి పొందవచ్చు.