అసెంబ్లీ ప్రాంగణంలో ఎస్బీఐ బ్యాంకును ప్రారంభించారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు,ఎమ్మెల్యే లు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. శాసనసభ,శాసనమండలి ఆవరణ పవిత్రమైన ప్రాంతంలో ఎస్బీఐ బ్యాంకును ప్రారంభించడం జరిగింది. ఇంత మంచి వాతావరణంలో ఏర్పాటు చేసినందుకు బ్యాంకు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు స్పీకర్ పోచారం.
అసెంబ్లీ పనిచేసే సిబ్బందికి కాకుండా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కూడా ఈ బ్యాంకు నుంచే వేతనాలు పడుతున్నాయి. 2016- 17 సంవత్సరాల గాను ఎస్బీఐ బ్యాంకు నుండి ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించిన రైతులకు బజాజ్, రిలయన్స్ ఇన్సూరెన్స్ నగదు రైతుల ఖాతాల్లో జమ అయిందని పోచారం తెలిపారు.