విశాల్‌ ‘యాక్షన్‌’ ప్రీ రిలీజ్‌ డేట్‌..

552
- Advertisement -

మాస్‌ హీరో విశాల్‌ హీరోగా సుందర్‌ సి. దర్శకత్వంలో రూపొందుతున్న హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ’యాక్షన్‌’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్‌ 15న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలకు సిద్ధమవుతోంది. శ్రీనివాస్‌ ఆడెపు నిర్మాతగా శ్రీకార్తికేయ సినిమాస్‌ పతాకంపై ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తెలుగు వెర్షన్ కి సంబంధించి, హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి ప్లాన్ చేశారు. ఈ నెల 9వ తేదీన ఇక్కడి ‘దసపల్లా కన్వెన్షన్’లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, తాజాగా ఒక పోస్టర్ ను వదిలారు.

action

ఈ మూవీలో విశాల్ సరసన నాయికగా తమన్నా నటించగా, సీనియర్ హీరో రాంకీ, ఐశ్వర్య లక్ష్మి, ఛాయా సింగ్, కబీర్ దుల్హన్ సింగ్, యోగిబాబు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ‘అభిమన్యుడు’.. ‘డిటెక్టివ్’ చిత్రాల మాదిరిగానే, ‘యాక్షన్’కి కూడా తెలుగు ప్రేక్షకుల ఆదరణ లభించడం ఖాయమనే నమ్మకంతో విశాల్ వున్నాడు.

- Advertisement -