ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక.!

142
sbi
- Advertisement -

సైబర్ క్రైమ్‌…ఈ పేరు వింటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఎటువైపు నుండి సైబర్ కేటుగాళ్లు పంజా విసురుతారో తెలియక ప్రజలు భయాందోళనకు గురవుతుండగా తాజాగా ఎస్బీఐ తమ కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసింది.

బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని స్మార్ట్ ఫోన్లలో ఉంచకూడదని సూచించింది. బ్యాంకింగ్ మోసాలు పెరిగిపోతుండటంతో స్మార్ట్ ఫోన్లలో బ్యాంకింగ్ పిన్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల సమాచారం, వాటి పాస్వర్డ్ లు, సీవీవీ నెంబర్ సహ కీలక సమాచారాన్ని దాచి ఉంచితే మోసాల బారిన పడే ప్రమాదం పొంచి ఉన్నట్టేనని హెచ్చరికలు జారీ చేసింది.

- Advertisement -