సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్…

154
kcr cm
- Advertisement -

సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. స్వల్ప లక్షణాలతో ఇవాళ టెస్టులు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఎర్రవల్లి‌లోని తన ఫాంహౌజ్‌లో హోం ఐసోలేషన్‌లో ఉన్నారని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తెలిపారు.

ప్రత్యేక వైద్య బృందం సీఎం ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుందని సోమేశ్‌ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు తెలిపారు. ..వైద్యుల బృందం నిరంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నదని పేర్కొన్నారు. సీఎంకు విశ్రాంతి తీసుకోవాలని సూచించామని చెప్పారు.

- Advertisement -