ఫోర్బ్స్ ఇండియా జాబితాలో తెలంగాణ వాసి!

75
hafeez
- Advertisement -

ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన టాప్ 100 డిజిటల్ స్టార్స్ జాబితాలో తెలంగాణ వాసికి చోటు దక్కింది. పెద్దపల్లి జిల్లా, గోదావరిఖనికి చెందిన సయ్యద్ హఫీజ్‌ అనే యూట్యూబర్ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు.ఈ జాబితాలో అతడు 32వ స్థానం దక్కించుకోవడం విశేషం.

కామెడీ, ఫుడ్, టెక్, ట్రావెల్, సోషల్ వర్క్, బ్యూటీ, ఫిట్‌నెస్, ఫ్యాషన్, బిజెనెస్ వంటి తొమ్మిది అంశాల్లో కంటెంట్ క్రియేటర్లను ఈ జాబితాకు ఎంపిక చేశారు. ఇందులో సయ్యద్ హఫీజ్ రూపొందించిన కంటెంట్ 8.89 క్రియేట్ స్కోర్ సాధించింది. దీంతో ఆయనకు ఈ జాబితాలో చోటు దక్కింది.

సయ్యద్ హఫీజ్ 2011 నుంచి ‘తెలుగు టెక్ ట్యూట్స్’ పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నాడు. ఈ ఛానెల్‌కు ప్రస్తుతం 15 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు.

- Advertisement -