ఆగస్టు 17న చైతూ సవ్యసాచి..!

277
Naga Chaitanya
- Advertisement -

హ్యాండ్సమ్ హీరో నాగచైతన్య అక్కినేని, హ్యాట్రిక్ డైరెక్టర్ చందు మొండేటి ల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ “సవ్యసాచి”. మైత్రీమూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగచైతన్య సరసన కథానాయికగా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. మాధవన్, భూమికలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తెలుగులో మాధవన్ చేస్తున్న తొలి స్ట్రెయిట్ మూవీ కావడంతో అంచనాలు పెరిగిపోయాయి.

సినిమా షూటింగ్ పూర్తికావొస్తుండటంతో చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఈ నెలలో షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టనున్నారు. సినిమా ఎప్పుడుఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ అందించారు నిర్మాతలు.

Savyasachi

ఈ నెల 8న టీజర్‌ని విడుదల చేయనున్నారు. ఆగస్టు 17వ తేదీన సినిమా విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం. చైతూ అక్కగా భూమిక నటించనుంది. గతంలో చందూ .. చైతూ కలిసి చేసిన ‘ప్రేమమ్’ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -