రేషన్ డీలర్ల సమ్మె విరమణ..

224
CV-Anand-ration-dealers
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వంతో రేషన్ డీలర్లు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. మంత్రులు ఈటెల,లక్ష్మారెడ్డి,పౌరసరఫరాల కార్పొరేషన్ ఛైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డిలతో మంగళవారం రేషన్ డీలర్లు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు రేషన్ డీలర్లు.

సీఎం కేసీఆర్‌ అన్నివర్గాల వారికి న్యాయం చేస్తారని ఈ సందర్భంగా రేషన్ డీలర్లతో మంత్రులు తెలిపారు. డీడీలు కట్టేందుకు సమయం పొడిగిస్తామని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించామని పెద్ది తెలిపారు.

తప్పని పరిస్థితుల్లో సమ్మె చేశామని…సీఎం కేసీఆర్‌పై తమకు నమ్మకం ఉందని తెలిపారు రేషన్ డీలర్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్‌ బాబు. రేషన్ డీలర్లకు కనీస వేతనం,పాత బకాయిలు,హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరామని తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోసం రేషన్ డీలర్ల గౌరవ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి తీవ్రంగా కృషి చేశారని వెల్లడించారు.

- Advertisement -