సవ్యసాచి ‘వై నాట్ సాంగ్‌’ వచ్చింది..

247
savyasachi movie
- Advertisement -

అక్కినేని నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సవ్యసాచి. నవంబర్‌ 2న ప్రపంచ వ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మాధవన్, భూమికలు కీలకపాత్రలు పోషిస్తుండడం విశేషం.

ఒక పాట మినహా “సవ్యసాచి” షూటింగ్ పూర్తయ్యింది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ ఉదయం 11 గంటలకు వై నాట్ అనే పాటను విడుదల చేసారు. ఈ మేరకు పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్.

Savyasachi

ప్రేమమ్‌ చిత్రం తరువాత చందు మొండేటి, యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్లో తెరకెక్కుతున్నఈ సినిమాపై అభిమానుల‌లో భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. స‌వ్య‌సాచి అంటే రెండు చేతుల‌ని స‌మ‌ర్ధ‌వంతంగా, శ‌క్తివంతంగా వాడే వాళ్ళు అని అర్ధం. తాజాగా విడుదలైన ఈ చిత్రం టీజర్‌ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుతోంది. ఈ టీజర్‌లో చైతూ నటన చూసిన ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు సంతోషంతో మురిసిపోతున్నారు.

- Advertisement -