ఉగాదికి వస్తున్న రాజుగాడు…

239
Raj Tarun’s Raju Gadu teaser from Ugadi
- Advertisement -

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, అమైరా దస్తూర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాజుగాడు’. సంజనారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్‌ను ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకురావాల్సి ఉన్న అనివార్య కారణాల వాయిదా పడుతు వస్తోంది.

దీపావళి సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కు మంచిరెస్పాన్స్ వచ్చింది. ఈ లుక్‌లో రాజ్‌తరుణ్‌.. అమైరా దస్తూర్‌ హ్యాండ్‌ బ్యాగ్‌లోని సెల్‌ఫోన్‌ను దొంగిలిస్తున్నట్లు డిజైన్ చేసిన పోస్టర్‌ అందరిని ఆకట్టుకుంది. తాజాగా టీజర్‌తో సినిమాపై అంచనాలు పెంచేలా ఆసక్తికరంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారట.

ఏటీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రాజ్‌తరుణ్‌ హీరోగా రూపొందిన ‘ఈడోరకం-ఆడోరకం’, ‘కిట్టుఉన్నాడుజాగ్రత్త’, ‘అంధగాడు’ హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి వీరి కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంతో అంచనాలు పెరిగిపోయాయి. ఒకరకమైన వింత వ్యాధితో బాధపడుతున్న యువకుడి ప్రవర్తన ఎలా ఉంటుందో చూపే ప్రయత్నమేనట ఈ సినిమా. ఇందులో హీరో రాజ్‌తరుణ్ తనకు తెలియకుండానే దొంగతనాలకు పాల్పడి ఆ తర్వాత ఇబ్బందులు పడుతుంటాడట.

- Advertisement -