ఫాపం బిత్తిరి సత్తి…తీన్మార్ కు సావిత్రి గుడ్ బై

1100
V6 Savithri
- Advertisement -

తీన్మార్ సావిత్రి ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రతి పల్లెలో ఈపేరు మార్మొగిపోతుంది. పల్లెటూరి భాషలో పక్కా తెలంగాణ యాసలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సావిత్రి. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకూ సావిత్రికి చాలా మంది అభిమానులే ఉన్నారు. అలాంటి సావిత్రి ఇక నుంచి మనకు తీన్మాన్ న్యూస్ లో కనిపించదా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. సావిత్రి వీ6ఛానల్ కు రాజీనామా చేసిందని తెలుస్తుంది.

v6savitri

సావిత్రికి తెలుగు రియాలీటి షో అయిన బిగ్ బాస్ 3 నుంచి ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది. అందుకోసమే ఆమె తీన్మార్ కు రాజీనామా చేసిందట. బిగ్ బాస్ లో అవకాశం రావడంతో ఆమె వీ6కు రాజీనామా చేసినట్లు సమాచారం. బిగ్‌బాస్‌లాంటి రియాలిటీ షోలో అవకాశం రావడం అనేది చాలా అరుదు. అటువంటి షో నుంచి పిలుపు రావడంతో.. అది జీవితాన్ని మలుపు తిప్పే రియాల్టీ షో కావడంతో ఆమె బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్‌గా వెళ్లేందుకు ఒప్పుకున్నదట.

వీ6 కుటుంబం నుంచి వెళ్లిపోతూ.. తన కుటుంబ సభ్యులను వదిలి వెళ్తున్నందుకు బాధగా ఉందంటూ ఆమె కన్నీరు పెట్టుకుందని సంస్థ ఉద్యోగులు చెప్పారు. అయితే మనం ఇక నుంచి సావిత్రికి వీ6లో కాకుండా బిగ్ బాస్ షో లో చూడొచ్చన్నమాట. ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే బిగ్ బాస్ 3 ప్రారంభమయ్యే వరకూ వెయిట్ చేయాల్సిందే.

- Advertisement -